
హైదరాబాద్, జనవరి 13: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కేంద్ర సర్వీస్ పోస్టులకు సంబంధించిన పోస్టుల ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఎంతో కీలకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ 2026), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన (బుధవారం) విడుదలకానుంది. ఈ మేరకు యూపీఎస్సీ సమాయత్తమవుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3, 2026వ తేదీన ముగియనుంది. మే 24న ప్రిలిమినరీ రాత పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
కాగా గతేడాది మొత్తం 1129 పోస్టుల భర్తీకి కమిషన్ ప్రకటన వెలువరించింది. ఈసారి ఎన్ని పోస్టులకు ప్రకటన వెలువడనుందో తెలియాల్సి ఉంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై అభ్యర్థులు ఎవరైనా అర్హులుగా యూపీఎస్సీ ప్రకటించింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఈ మూడు దశల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
యూపీఎస్సీ ఎగ్జాం క్యాలెండర్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) 1 2026 పరీక్షల షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్‌డీఏ, సీడీఎస్‌లో చేరేందుకు 2026 సంవత్సరానికి రాత పరీక్షను ఏప్రిల్ 12, 2026వ తేదీన నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వక్ఎ మ్యాథమెటిక్స్ పేపర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జనరల్ ఎబిలిటీ పేపర్ పరీక్షను నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షల షెడ్యూల్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.