UPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు ఇక నుంచి ఒకసారి రిజిస్టర్ చేసుకుని రిక్రూట్‌మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి నమోదు పూర్తయిన తర్వాత, సమాచారం కమిషన్ సర్వర్‌లలో సురక్షితంగా ఉండిపోతుందని UPSC తెలిపింది. UPSC పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వ్యక్తిగత వివరాలను పూరించడం ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇంతకుముందు, దరఖాస్తు చేసిన ప్రతిసారీ వ్యక్తిగత వివరాలను పదేపదే నింపాల్సి వచ్చేది. సమాచారాన్ని పదేపదే నమోదు చేయడం ద్వారా సమయం వృథా కాకుండా ఉండేందుకు కొత్త పద్ధతి సహాయపడుతుంది.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ప్రతి పరీక్షకు మీ దరఖాస్తును సమర్పించేటప్పుడు మీరు ఇకపై వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదు. కొత్త పద్ధతిలో సమయం కూడా ఆదా అవుతుంది. త్వరితగతిన సమాచారాన్ని పూరించడం ద్వారా తప్పులు జరగకుండా చేస్తుంది.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అంటే..
ఇప్పుడు ఏ జాబ్‌కు అప్లై చేసుకోవాలన్నా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు.. ఇంకెప్పుడైనా దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రక్రియ ఈజీగా పూర్తవుతుంది. అయితే యూపీఎస్సీ ఉద్యోగార్థులకు మాత్రం ఇప్పటివరకు ఈ సదుపాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ కూడా తాజాగా ఓటీఆర్‌ను ప్రారంభించారు. వారి సమయం ఆదా చేస్తూ, దరఖాస్తు ప్రక్రియను మరింత ఈజీ చేసేందుకు ఓటీఆర్(OTR) ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు. ఇక నుంచి యూపీఎస్సీలోని వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు అప్లె చేసుకున్నప్పుడు ప్రతిసారీ ప్రాథమిక వివరాలను నింపాల్సిన పనిలేదు.
మొదటిసారి రిజిస్టర్ చేస్తున్నప్పుడే జాగ్రత్తగా..
మీరు అందించిన ప్రాథమిక సమాచారాన్ని సర్వర్‌లలో సురక్షితంగా స్టోర్ చేస్తారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉద్యోగార్థులకు చాలా ఉపయోగపడుతుంది. పొరపాటున కూడా తప్పుగా సమాచారం నమోదు అయ్యే అవకాశం ఉండదు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే అధికారిక వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. ఓటీఆర్ సూచనలను పరిశీలించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తొలిసారి రిజిస్టర్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం