NEET PG 2022 updates: నీట్ పీజీ పరీక్ష 6-8 వారాలపాటు వాయిదా! సుప్రీం తీర్పుకు ముందే కేంద్రం కీలక నిర్ణయం..

|

Feb 04, 2022 | 12:44 PM

అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించక ముందే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) నీట్ పీజీ పరీక్ష 2022 (NEET PG 2022 Exam)ను 6-8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు గురువారం (ఫిబ్రవరి 3,2022) ఉత్తర్వులు జారీ చేసింది...

NEET PG 2022 updates: నీట్ పీజీ పరీక్ష 6-8 వారాలపాటు వాయిదా! సుప్రీం తీర్పుకు ముందే కేంద్రం కీలక నిర్ణయం..
Neet Pg
Follow us on

NEET PG 2022 Postponed : అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించక ముందే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) నీట్ పీజీ పరీక్ష 2022 (NEET PG 2022 Exam)ను 6-8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు గురువారం (ఫిబ్రవరి 3,2022) ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12న ఈ పరీక్ష జరగాల్సిఉండగా తాజా నిర్ణయంతో వాయిదా పడింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్న్‌షిప్ పూర్తిచేయని విద్యార్ధులు పరీక్షను వాయిదా వేయాలని బారీ ఎత్తున డిమాండ్ చేశారు. అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ చేపట్టనుంది. కోవిడ్-19 కారణంగా ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్న్‌షిప్ వ్యవధిని పూర్తి చేయలేకపోయారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పట్టభద్రులు ఇంటర్‌షిప్‌ను పూర్తి చేయకుండా ఈ సంవత్సరం నిర్వహించే నీటి పీజీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందలేరు. దీని కారణంగా వీరు పరీక్షకు హాజరు కాలేని పరిప్థితి నెలకొంది.

కాగా నీట్ పీజీ 2022 పరీక్ష మార్చి 12న దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగాల్సి ఉంది. ఐతే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ పరీక్ష 6-8 వారాల పాటు వాయిదా పడింది. నీట్ పీజీ అభ్యర్థులు తాము 2021 సంవత్సరంలో కోవిడ్ డ్యూటీలో నియమించబడ్డామని, దీని కారణంగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయలేకపోయామని, అందువల్లనే పరీక్షను వాయిదా వేయవల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఇంకా తీర్పు వెల్లడించలేదు. ఐతే అంతకు ముందే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ పీజీ పరీక్ష 2022 పరీక్షను వాయిదా వేయడం గమనార్హం.

Also Read:

NAL Jobs 2022: నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 40 స్టైపెండరీ ట్రైనీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!