EPFO: ఈపీఎఫ్‌వోలో భారీగా చేరిక.. పెరిగిన ఉద్యోగ కల్పన..

|

Nov 21, 2024 | 1:50 PM

దేశంలో ఈపీఎఫ్‌ పరిధిలోకి వస్తున్న ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ సంఖ్య ఏకంగా 1.88 మిలియన్లకు చేరిందని తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో తెలిపారు. గతేడాదితో పోల్చితే ఇందులో 9.3 శాతం వృద్ధి కనిపించడం విశేషం..

EPFO: ఈపీఎఫ్‌వోలో భారీగా చేరిక.. పెరిగిన ఉద్యోగ కల్పన..
Epfo
Follow us on

ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ కింద నికర ఉద్యోగ కల్పన భారీగా పెరిగింది. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 1.88 మిలియన్లకు చేరిందని ప్రభుత్వ డేటా తెలిపింది. 2023 సెప్టెంబ్‌ నాటితో పోల్చితే 9.3 శాతం పెరుగుదల కనిపించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోందని చెప్పేందుకు ఈ గణంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ డేటా ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్య 1.85 మిలియన్ల ఉద్యోగాలతో పోలిస్తే నెలవారీగా 1.6 శాతం పెరుగుదల కనిపించింది. ఈపీఎఫ్‌వోలో చేరిన కొత్త ఉద్యోగుల సంఖ్య ఏప్రిల్‌లో 1.41 మిలియన్లు, మే నెలలో 1.51 మిలియన్ల, జూన్‌ నెలకు వచ్చేసరికి 1.67 మిలియన్లు, అలాగే జూల్‌ నాటికి 1.99 మిలియన్లుగా ఉన్నారు.

2024 సెప్టెంబర్‌లో సుమారు 0.95 మిలియన్ల మంది కొత్త ఉద్యోగులు ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకున్నారు. 2023 సెప్టెంబర్‌తో పోల్చితే ఇది 6.2 శాతం అదికం. దేశంలో పెరుగుతోన్న ఉద్యోగవకాశాలకు ఇది నిదర్శనమని మంత్రిత్వశాఖ ఒక ప్రటకనలో తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో చేరిన వారిలో 0.84 మిలియన్ల మంది వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండడం విశేషం. దేశీయ వర్క్‌ ఫోర్స్‌లో ఎక్కువ మంది యువత చేరుతున్నట్లు ఈ గణంకాలు సూచిస్తున్నాయి.

అయితే 1.41 మిలియన్ల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓ నుంచి ఎగ్జిట్‌ అయ్యారని ఆ తర్వాత తిరిగి చేరారని పేరోల్‌ డేటా పేర్కొంది. 2023 సెప్టెంబర్‌తో పోల్చితే 18.2 శాతం వృద్ధి సాధించింది. ఇక సెప్టెంబర్‌లో 0.37 మిలియన్ల మంది మహిళా సభ్యులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. 2023లో పోల్చితే 12.1 శాతం పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్‌లకు చెందిన 1.13 మిలియన్ల మంది ఉద్యోగాలు ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చాయి. మొత్తం వాటాలో మహారాష్ట్ర ఒక్కటే 21.2 శాతం వాటాను కలిగి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..