
హైదారబాద్, అక్టోబర్ 8: యూజీసీ నెట్ డిసెంబర్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ప్రారంభించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) లేదా పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ugcnet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ 2025 డిసెంబర్ సెషన్ రాత పరీక్షలు ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయి. యూజీసీ మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 7, 2025 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, పీడబ్ల్యూబీడీ, థార్డ్ జండర్ అభ్యర్ధులు రూ.325 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఎన్టీఏ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. పరీక్ష నగరం, అడ్మిట్ కార్డు, పరీక్ష నిర్వహించే ఖచ్చితమైన తేదీలను ఈ కింద చెక్ చేసుకోండి.
యూజీసీ నెట్ డిసెంబర్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.