Teaching Jobs: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సిరిసిల్లలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులకు గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* బీఎస్సీ డిజైన్ అండ్ టెక్నాలజీ కోసం గెస్ట్ ఫ్యాకల్టీని భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీడిజైన్(టెక్స్‌టైల్ డిజైన్/ ఫ్యాషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* దీంతోపాటు సంబంధిత విభాగంలో 2-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి లేదా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్/ ఫ్యాషన్ డిజైన్), ఎంటెక్(కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,00000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు చివరి తేదీ 24-08-2022కాగా, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 05-09-2022 తేదీన ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..