TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష విధానం.. చదవాల్సిన అంశాలు.. ప్రశ్నల సరళి తెలుసుకోండి..?

|

Apr 15, 2022 | 7:04 AM

TSPSC Group 1 Exam: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. 503 పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా గ్రూప్- 1 పోస్టులకు

TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష విధానం.. చదవాల్సిన అంశాలు.. ప్రశ్నల సరళి తెలుసుకోండి..?
Tspsc Group 1 Exam
Follow us on

TSPSC Group 1 Exam: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. 503 పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా గ్రూప్- 1 పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూలను ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష విధానం మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (OTR)లో సవరణలకు 15 రోజుల క్రితం కమిషన్‌ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కమిషన్‌ వద్ద 25 లక్షల మంది ఓటీఆర్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 1.2 లక్షల మంది మాత్రమే సవరించుకున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌ సవరించుకున్న, నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే టీఎస్‌పీఎస్సీ జారీ చేసే ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ మేరకు ఓటీఆర్‌ సవరించాలని రోజుకు లక్ష మందికి కమిషన్‌ ఈ-మెయిళ్లు పంపిస్తోంది. చివరి నిమిషం వరకు వేచి ఉండటం కన్నా, ముందే సిద్ధం చేసుకోవాలని సూచిస్తోంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1 ప‌రీక్ష విధానం, సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

గ్రూప్‌–1 ఎంపిక రెండు విధాలుగా ఉంటుంది.

1. ప్రిలిమినరీ ఎగ్జామ్‌

2. మెయిన్‌ ఎగ్జామినేషన్

అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో విజయం సాధించి, నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఇందులోనూ నిర్దేశిత మార్కులు సాధించిన అభ్యర్థులకు మెరిట్‌ ప్రకారంగా తుది జాబితా విడుదల చేసి ఉద్యోగాలు కేటాయిస్తారు.

ప్రిలిమినరీ ప‌రీక్ష విధానం: మొదటి దశ ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తారు. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు.

మెయిన్‌ ఎగ్జామినేషన్: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వాళ్లు రెండో దశలో నిర్వహించే మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లతో 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఆరు పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌గా అర్హత సాధించాల్సి ఉంటుంది.

పేపర్‌ -1: 150 మార్కుల పేపర్. ఇందులో ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు, భారత రాజకీయ స్థితిగతులు, భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి, విద్య, మానవ వనరుల అభివృద్ధి

పేపర్‌ -2: 150 మార్కుల పేపర్. భారత దేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగం(1757–1947), తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ.

పేపర్‌-3: 150 మార్కుల పేపర్. ఇందులో భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు
భారత రాజ్యాంగం పరిపాలన వంటి అంశాలు ఉంటాయి.

పేపర్‌- 4: 150 మార్కుల పేపర్. ఇందులో ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ,
అభివృద్ధి, పర్యావరణ సమస్యల నుంచి ప్రశ్నలు వస్తాయి.

పేపర్‌- 5: 150 మార్కుల పేపర్. ఇందులో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం, విజ్ఞానశాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, సమస్యా పరిష్కారం

పేపర్‌- 6: 150 మార్కుల పేపర్. ఇందులో ప్రధానంగా తెలంగాణ తొలి దశ (1948–1970), ఉద్యమ దశ (1971–1990), తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991–2014) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

Good Friday 2022: నేడు గుడ్‌ఫ్రైడే.. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా..!

Operation: ఆపరేషన్ తర్వాత చాలామంది బరువు పెరుగుతారు.. కారణం ఏంటో తెలుసా..!

Health Tips: వినికిడి లోపం రావడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం..!