TSPSC: వరుసగా ఫలితాలు విడుదల చేస్తున్న టీఎస్‌పీఎస్‌సీ.. తాజాగా మరో 6

|

Feb 17, 2024 | 7:25 AM

మొత్తం 547 ఖాళీలకు సంబంధించి జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందిపరిచింది. ఈ మెరిట్‌ జాబితాలో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి ఉద్యోగ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి...

TSPSC: వరుసగా ఫలితాలు విడుదల చేస్తున్న టీఎస్‌పీఎస్‌సీ.. తాజాగా మరో 6
TSPSC
Follow us on

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దూకుడుపెంచింది. కొత్త పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రూప్‌ 4 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ర్యాంకుల జాబితాను కమిషన్‌ విడుదల చేసింది. ఇదిలా ఉంటే తాజాగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన నిర్వహించిన మొత్తం 6 పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

మొత్తం 547 ఖాళీలకు సంబంధించి జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందిపరిచింది. ఈ మెరిట్‌ జాబితాలో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి ఉద్యోగ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. 2022లో ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ వచ్చింది. ఇక గతేడాది ఈ పరీక్షలను నిర్వహిచంగా, తాజాగా ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* గతేడాది జూలై నెలలో 175 టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

* ఇక 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 2023 మే 19న పరీక్ష జరిగింది. ఈ మెరిట్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

* 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2023 జూన్‌ 17న పరీక్ష జరిగింది. మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

* ఇంటర్‌ విద్యలో 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా… 2023 మే 17న పరీక్ష నిర్వహించారు. రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

* ఇదిలా ఉంటే 148 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి గతేడాది మే నెలలో పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

* 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి జూన్‌ 28న పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

లేదంటే టీఎస్‌పీఎస్‌ అధికారిక వెబ్ సైట్‌లో కూడా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మొదటగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి. అనంతరం పైన పేర్కొన్ని నోటిఫికేషన్లు మెరిట్ జాబితాల లింక్స్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్‌ చేస్తే వెంటనే పీడీఎఫ్ ఫైల్‌ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ ర్యాంక్ ఎంత ఉందో, హాల్‌ టికెట్‌ ఆధారంగా చెక్‌ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..