TSPSC AMVI Notification: తెలంగాణలో 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు తప్పనిసరి..

|

Jan 01, 2023 | 8:57 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC AMVI Notification: తెలంగాణలో 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు తప్పనిసరి..
TSPSC AMVI Recruitment
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హెవీ మోటారు వాహన (ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 1, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు రూ.320లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్‌ 23, 2023న నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.45,960ల నుంచి రూ.1,24,150ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.