TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..

|

Aug 05, 2022 | 7:00 PM

TSPSC: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్‌1 మొదలు కానిస్టేబుల్‌, ఎస్సై, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా మరో...

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..
Follow us on

TSPSC: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్‌1 మొదలు కానిస్టేబుల్‌, ఎస్సై, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా నిర్వహించారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-08-2022న మొదలవుతుండగా 06-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్షను 2022 డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 45,960 నుంచి రూ. 1,24,150 వరకు చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..