2015 డిసెంబరు 23 తర్వాత ఇంటర్‌/డిగ్రీ పాసయ్యారా? ఐతే TS TET 2022 దరఖాస్తులో ఈ నిబంధన మీకోసమే..

|

Mar 27, 2022 | 2:54 PM

ఈసారి టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 2015 డిసెంబరు 23 తర్వాత ఇంటర్‌ లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు తప్పనిసరిగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యి ఉండాలనే నిబంధన..

2015 డిసెంబరు 23 తర్వాత ఇంటర్‌/డిగ్రీ పాసయ్యారా? ఐతే TS TET 2022 దరఖాస్తులో ఈ నిబంధన మీకోసమే..
Ts Tet 2022
Follow us on

TS TET Eligibility Criteria 2022: తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ముందస్తుగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌  (TET 2022 Notification)ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఏడాది నిర్వహించే టెట్ పరీక్షకు ఒక లక్ష 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఐతే ఈసారి టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 2015 డిసెంబరు 23 తర్వాత ఇంటర్‌ లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు తప్పనిసరిగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యి ఉండాలనే నిబంధన పెట్టింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నిబంధన ప్రకారం జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌ లేదా డిగ్రీలో 50 శాతం మార్కులు తప్ప ఖచ్చితంగా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం 45 శాతం మార్కులు కలిగి ఉండాలి. అంటే పేపర్‌-1 రాసేవారికి ఇంటర్‌లో, పేపర్‌-2 రాసేవారికి డిగ్రీలో సాధించిన మార్కుల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారన్నమాట. అంతకంటే తక్కువ మార్కులతో ఇంటర్/డిగ్రీలో మార్కలు సాధించిన వారు టెట్‌ రాయడానికి అర్హులుకారు. గతంలో ఈ నిబంధన లేదు. ఎందుకంటే టెట్‌ జీవో 2015 డిసెంబరు 23న ఇవ్వడం, ఆ తర్వాత 2016 మే, 2017 జులైలో టెట్‌ జరపడం వల్ల వాటికి హాజరయ్యేవారు జీవో కంటే ముందుగా పాసై ఉండటంతో ఈ షరతు వారికి వర్తించదు. జీవో విడుదల తర్వాత ఉత్తీర్ణులైనవారికి ఈ మేరకు మార్కుల నిబంధన విధించారు. అయితే 2015కు ముందు పాసైన వారికి మాత్రం జనరల్‌ అభ్యర్థులకు 45, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఈ విధమైన షరతుతో ఎంతమందికి టెట్‌ రాసే అవకాశం ఉంటుందో వేచి చూడాల్సిందే! కాగా టీచర్‌ ఎలిజిబిటిలీ టెస్ట్‌ (టెట్‌ 2022)కు దరఖాస్తుల సమర్పణ మార్చి 26 నుంచి ప్రారంభమైంది. మొదటిరోజు 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు టెట్‌కార్యదర్శి రాధారెడ్డి తెలిపారు. ఏమైనా సమస్యలుంటే హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. అభ్యర్థుల సందేహాలు, సూచనల కోసం హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి జూన్‌ 12 వరకు హెల్ప్‌డెస్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లకు కాల్ చేసి సందేహాల నివృతి చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్లను జూన్‌ 6 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also Read:

Artillery Hyderabad Recruitment: పది/ఇంటర్‌ అర్హతతో.. హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!