
తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మే 24.. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి విడుదల చేసింది.. తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న పాలిసెట్(TG Polycet) పరీక్షను నిర్వహించారు. మూల్యాంకనం అనంతరం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సాంకేతిక విద్య కమిషనర్ దేవ సేన పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు టీవీ9 వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాల్లో నలుగురికి టాప్ -1 ర్యాంక్ వచ్చింది. మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 81.88% శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. పాలిసెట్-2025కు 92.64 శాతం మంది హాజరయ్యారు. విషయం తెలిసిందే. దీనికి మొత్తంగా 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు. కాగా.. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నట్లు ఈసారి నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.