TS POLYCET 2022: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి పాలిసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

|

May 09, 2022 | 7:47 AM

“పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)” దరఖాస్తులకు గడువుతేదీ జూన్‌ 4వ తేదీగా నిర్ణయించారు. కాగా.. జూన్‌ 5 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

TS POLYCET 2022: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి పాలిసెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
Ts Polycet 2022
Follow us on

Telangana POLYCET Registration: తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్లొమా, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ (POLYCET-2022) దరఖాస్తు ప్రక్రియ (09-05-2022) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌‌లో జరగనుంది. “పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)” దరఖాస్తులకు గడువుతేదీ జూన్‌ 4వ తేదీగా నిర్ణయించారు. కాగా.. జూన్‌ 5 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన 12 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. పాలిసెట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చర్‌, శ్రీ కొండాలక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ వర్సిటీలో హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అదేవిధంగా.. పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలోని యానిమల్‌ హజ్బెండరీ, ఫిషరీస్‌ కోర్సులు, బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అడ్మిషన్స్ ఇవ్వనున్నారు.

కాగా.. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) లో సీట్లను గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పాలిసెట్‌ ద్వారానే భర్తీచేయనున్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అప్లై చేసేందుకు ఈ లింకులను క్లిక్ చేయండి.. 

https://tspolycet.nic.in/ , https://polycet.sbtet.telangana.gov.in

మరిన్ని కేరిర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

IGM Recruitment 2022: నెలకు రూ.85570ల జీతంతో.. ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే!

CLAT 2022 Exam date: రేపటితో ముగియనున్న క్లాట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ.. భారీగా తగ్గిన ఫీజులు..