CLAT 2022 Exam date: రేపటితో ముగియనున్న క్లాట్ 2022 దరఖాస్తు ప్రక్రియ.. భారీగా తగ్గిన ఫీజులు..
యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022 దరఖాస్తు ప్రక్రియ రేపటితో (మే 9) ముగియనుంది. గతంలో..
CLAT 2022 applicaion last date: యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022 దరఖాస్తు ప్రక్రియ రేపటితో (మే 9) ముగియనుంది. గతంలో క్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 31తో ముగియనుండగా దానిని ఎన్‌ఎల్‌యూ మే 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎన్‌ఎల్‌యూ విద్యార్ధులకు సూచించింది. కాగా క్లాట్ 2022 ప్రవేశ పరీక్ష జూన్ 19న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా UG-CLAT 2022కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు CLAT LLMకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లాట్ దరఖాస్తు రుసుము ఇలా.. జనరల్ అభ్యర్థులు రూ. 4,000, ఎస్సీ/ఎస్టీ/బీపీఎల్ అభ్యర్థులు రూ. 3,500లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. గత ఏడాది క్వశ్చన్ పేపర్‌ను కొనుగోలు చేసే అభ్యర్ధులు రూ. 500లు చెల్లించి పొందుకోవచ్చు. ఈ ఏడాది అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఫీజును కూడా కన్సార్టియం భారీగా తగ్గించింది. వీరికి ఫీజును రూ.50,000 నుంచి రూ.30,000కు కుదించింది. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులకు రూ.20,000గా నిర్ణయించింది.
Also Read: