LAWCET & TS PGLCET : తెలంగాణ లా సెట్, పిజి లా సెట్ దరఖాస్తు గడువు వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ మేరకు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అటు, తెలంగాణలో ఎంసెట్ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఇప్పటి వరకు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విభాగంలో 1,35,151 అప్లికేషన్స్ రాగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌లో 66,216 దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తంగా 2,01,367 మంది అభ్యర్థులు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఎంసెట్ అప్లికేషన్స్ దాఖలుకు గడువు పొడిగించారు. జూన్ 3వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో టీఎస్ ఎంసెట్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని కన్వీనర్ వెల్లడించారు. మరోవైపు, ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వ టీచర్లకి వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పరీక్షలు జరపాలని సదరు పిటిషన్ లో పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.