Tirupati Govt Maternity Hospital Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల (Tirupati Govt Maternity Hospital) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (Operation Theatre Assistant) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 10
ఖాళీల వివరాలు: ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు
పే స్కేల్: నెలకు రూ.14,250ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతోపాటు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టరయ్యి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: సూపరింటెండెంట్ కార్యాలయం, జీఎంహెచ్, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఏపీ.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: