TIFR Recruitment 2022: ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR Mumbai) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8
పోస్టుల వివరాలు:
జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పోస్టులు: 1
ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు: 1
సెక్యూరిటీ గార్డ్ పోస్టులు: 1
లైబ్రరీ ట్రైనీలు పోస్టులు: 4
తాత్కాలిక వర్క్ అసిస్టెంట్ పోస్టులు: 1
వయోపరిమితి: జనవరి 1, 2022నాటికి అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.59,478ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, యూజీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, టీఐఎఫ్‌ఆర్, హోమీ భాభా రోడ్, నేవీ నగర్, ముంబాయి- 400005.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: