TGSRTC Recruitment 2026: ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..ఇవి పూర్తి వివరాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 డిసెంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

TGSRTC Recruitment 2026: ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..ఇవి పూర్తి వివరాలు..
Tgsrtc Recruitment 2026

Updated on: Dec 26, 2025 | 10:35 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 2026 సంవత్సరానికి 198 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులు, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు 114 ఖాళీలను TSLPRB ప్రకటించింది. TGSRTC సూపర్‌వైజర్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ ఈ పోస్టులకు సంబంధించిన 198 ఖాళీల గురించి పూర్తి వివరాలను అందిస్తుంది. వీటిలో అర్హత ప్రమాణాలు, విద్యా అర్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరిన్ని వివరాలను పొందుపర్చింది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు అప్లికేషన్స్‌ స్వీకరించనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత, అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పోస్టుకు అభ్యర్థుల ఎంపిక వారి మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ తమ దరఖాస్తును అనర్హత వేటు పడకుండా ఉండటానికి TGSRTC రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ నుండి అన్ని ప్రమాణాలు, ఇతర వివరాలను చెక్‌ చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలను నిర్ణయించారు. నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు వేతనం ఉండనుంది. కేవలం జీతం మాత్రమే కాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.