TGPSC DAO Exam Date: టీజీపీఎస్సీ డీఏవో పోస్టులకు రాత పరీక్ష తేదీ విడుదల.. రేపట్నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌

|

Jun 24, 2024 | 3:54 PM

తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. జూన్‌ 30వ తేదీ నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్‌లో ఆన్‌లైన్‌ విధానంలో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్‌ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి..

TGPSC DAO Exam Date: టీజీపీఎస్సీ డీఏవో పోస్టులకు రాత పరీక్ష తేదీ విడుదల.. రేపట్నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌
TGPSC DAO Exam Date
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 24: తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. జూన్‌ 30వ తేదీ నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్‌లో ఆన్‌లైన్‌ విధానంలో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్‌ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరుగుతుందని కమిషన్‌ ప్రకటనలో పేర్కొంది. రేపట్నుంచి (జూన్‌ 25) నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఈ సందర్భంగా కమిషన్‌ సూచించింది.

నేడే ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ ఎగ్జామ్‌ 2024 నోటిఫికేషన్‌

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (సీజీఎల్‌) పరీక్ష-2024కు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదల అవనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో రాత పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో అర్హత సాధించి ఉంటే సరిపోతుంది. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ జాబ్‌ క్యాలండర్‌ 2024 విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్‌ ప్రకారం ఎస్ఎస్‌సీ సీజీఎస్‌ 2024 నోటిఫికేషన్‌ జూన్‌ 24న వెలువడనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.