TG TET 2026 Application: నిరుద్యోగులకు అలర్ట్.. టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే

TG TET 2026 online Application: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ జనవరి 2026)కు సంబంధించి పూర్తి నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో స్థరిపడాలనుకునే నిరుద్యోగులకు టెట్ తప్పనిసరి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా కొలువుల్లో పని చేస్తున్నవారికి కూడా ఉద్యోగాల్లో కొనసాగాలనంటే..

TG TET 2026 Application: నిరుద్యోగులకు అలర్ట్.. టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే
Telangana TET 2026 January Online Application

Updated on: Nov 16, 2025 | 6:10 AM

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ జనవరి 2026)కు సంబంధించి పూర్తి నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో స్థరిపడాలనుకునే నిరుద్యోగులకు టెట్ తప్పనిసరి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా కొలువుల్లో పని చేస్తున్నవారికి కూడా ఉద్యోగాల్లో కొనసాగాలనంటే టెట్ తప్పనిసరిగా చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కూడా. దీంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 29వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- జనవరి 2026 పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష ప్రాథమిక పాఠశాలలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారు రాయవల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 పరీక్ష ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు మాత్రం 45 శాతం ఉత్తీర్ణత సరిపోతుంది. అలాగే వీరు తప్పనిసరిగా D.El.Ed / B.El.Ed / D.Ed లేదా D.Ed స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణత ఉండాలి.

ఇక పేపర్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్ధులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బీఎడ్‌/ బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ లేదా B.A.Ed / B.Sc.Edలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. D.El.Ed / B.Ed చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్ష రాయవచ్చు. టెట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి ఇందులో వయస్సు పరిమితి ఉండదు. ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. టెట్ పరీక్షలో ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందినట్లు పరిగణిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్‌ 1 లేదా పేపర్‌ 2 ఏదైనా ఒక పరీక్షకు రూ.750, రెండు పేపర్లు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇక హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 27, 2025వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జనవరి 3 నుంచి 31, 2026వ తేదీ వరకు జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీలోపు విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.