10th Class Exams Cancelled: సర్కార్ షాకింగ్ నిర్ణయం.. తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రద్దు! వచ్చే ఏడాది నుంచే అమలు

రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 20) రేవంత్ సర్కార్ ప్రకటించింది. బదులుగా నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నట్లు..

10th Class Exams Cancelled: సర్కార్ షాకింగ్ నిర్ణయం.. తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రద్దు! వచ్చే ఏడాది నుంచే అమలు
10th Class Public Exams Cancelled In Telangana

Updated on: Mar 20, 2026 | 6:26 PM

హైదరాబాద్‌, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 20) రేవంత్ సర్కార్ ప్రకటించింది. బదులుగా నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నట్లు రేవంత్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు పదో తరగతి పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా విధానానికి భిన్నంగా, సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. బదులుగా ఏకీకృత విధానం తీసుకొస్తు్న్నట్లు పేర్కొన్నారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు విద్యార్థులకు ఒకే రకమైన విద్యా విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసి, విద్యా సంవత్సరాన్ని కొనసాగించేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.

విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. స్కూల్ విద్య నుంచి కాలేజీ విద్య వరకు ఎక్కడా అడ్డంకులు లేకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించేలా ఈ కొత్త విధానం దోహదపడనుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ఈ ప్రకటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది.

అనంతరం సీఎం రేవంత్ బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ఇది సంక్షేమ అభివృద్ధి బడ్జెట్. రెవెన్యూ పెరిగింది. మేము అప్డేట్ అవుతున్నాం. రేషన్ కార్డు ఉన్నవాళ్లకి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తాం. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పథకం తెచ్చినందుకు బీఆర్ఎస్ చెవిలో పువ్వులు పెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వ అప్పులకు 3 లక్షల 30 వేల కోట్లు వడ్డీ కడుతున్నాం. 17 వేల కోట్లు సంక్షేమానికి వాడామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us