AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Polycet 2026: పాలిసెట్‌ పరీక్ష మీరు రాస్తున్నారా? ఈ కీలక అప్‌డేట్‌ మీ కోసమే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పాలిసెట్‌ 2026 పరీక్ష మరో 5 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (SBTET) హాల్‌ టికెట్లను..

TG Polycet 2026: పాలిసెట్‌ పరీక్ష మీరు రాస్తున్నారా? ఈ కీలక అప్‌డేట్‌ మీ కోసమే
Telangana Polycet Exam
Srilakshmi C
|

Updated on: May 08, 2026 | 5:29 PM

Share

హైదరాబాద్‌, మే 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పాలిసెట్‌ 2026 పరీక్ష మరో 5 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (SBTET) హాల్‌ టికెట్లను కూడా జారీ చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పాలీసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ లింక్‌పై క్లిక్‌ చేసి పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్‌, క్యాప్చా ఎంటర్ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా మొబైల్‌ నంబర్‌ క్యాప్చా ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక పాలీసెట్‌ ఫలితాలు పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత విడుదల చేయనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ డిప్లొమా, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్‌ డిప్లొమా, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు.

తెలంగాణ పాలిసెట్‌ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎస్సీ గురుకుల ప్రవేశ పరీక్ష 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2026-27 సంవత్సరానికిగాను ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను గురుకుల సొసైటీ తాజాగా విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఇంటర్ ప్రవేశ పరీక్ష మే 15న నిర్వహించనున్నారు. ఈక్రమంలో మే14వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..