TS Model School Results 2024: తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల తేదీ ఇదే.. ప్రవేశాలు ఎప్పటినుంచంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం మంది విద్యార్ధులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది ప్రవేశాల కోసం మొత్తం 62,982 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా వారిలో 51,525 మంది విద్యార్ధులు..

TS Model School Results 2024: తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల తేదీ ఇదే.. ప్రవేశాలు ఎప్పటినుంచంటే..
TS Model School Results

Updated on: Apr 08, 2024 | 3:34 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం మంది విద్యార్ధులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది ప్రవేశాల కోసం మొత్తం 62,982 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా వారిలో 51,525 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగింది. మొత్తం 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఉంటుంది. 2 గంటల సమయంలో రాసిన ఈ పరీక్ష ఇంగ్లిష్‌/ తెలుగు మాధ్యమాల్లో జరిగింది.

తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఫలితాలు మే 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం మే 27 నుంచి మే 31వ తేదీ వరకు ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 6వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు కల్పిస్తారు

రైల్వేలో 2,888 అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. సౌత్ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే రాయపూర్‌లో 1113, సౌత్‌ ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే బిలాపూర్‌లో 733, రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ కపుర్తలాలో550, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్ చిత్తరంజన్‌లో 492.. అప్రెంటిస్‌ ఖాళీలకు ప్రకటనలు వెలువడ్డాయి. టెన్త్‌, ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రుసుము చెల్లించవల్సిన అవసరం లేదు. అలాగే రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించరు. టెన్త్‌ లేదా ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.