తెలంగాణలో 886 TGPSC మున్సిపల్ ఉద్యోగాలు.. జనవరిలో నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు మొత్తం 886 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపినట్లు సమాచారం. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించిన అనంతరం..

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు మొత్తం 886 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపినట్లు సమాచారం. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించిన అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 24 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకొచ్చి పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా పరిపాలనా పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 886 మంది సిబ్బంది అవసరమని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ నుంచి కూడా అంగీకారం లభించినట్లు సమాచారం.
ఏయే పోస్టులు భర్తీ చేయనున్నారు?
ప్రతిపాదిత నియామకాల్లో మున్సిపల్ కమిషనర్ల నుంచి ఇంజినీరింగ్, అకౌంట్స్, ఆరోగ్య విభాగాల సిబ్బంది వరకు వివిధ కేటగిరీల పోస్టులు ఉన్నాయి.
- గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లు: 20
- డిప్యూటీ కమిషనర్లు (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు): 11
- జూనియర్ అసిస్టెంట్లు: 86
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు: 56
- హెల్త్ అసిస్టెంట్లు: 40
- జూనియర్ అకౌంటెంట్లు: 40
- సీనియర్ అకౌంటెంట్లు: 40
వీటితోపాటు వార్డు ఆఫీసర్లు, ఇతర కేటగిరీల పోస్టులను కూడా భర్తీ చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ల వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్పష్టమవుతాయి. కొత్త పోస్టుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం లభిస్తుందని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో నిర్ణయం వాయిదా పడినట్లు సమాచారం. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం పోస్టుల భర్తీకి సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ నియామకాలను టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో అంటే 2027 జనవరిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక ప్రకటన విడుదల కావచ్చని అంచనా. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మున్సిపల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలు వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిర్ధారించుకోవాలి.




