హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్షల నోటిఫికేషన్ ఈ రోజు (ఫిబ్రవరి 20) విడుదల కానుంది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెబ్‌సైట్‌లో ఈఏపీసెట్ నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొంది.
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈ సారి కూడా ఈఏపీసెట్ 2025 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు. ఈ మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్ కుమార్‌ను ఈఏపీసెట్ 2025 పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది. ఇప్పటికే ఈఏపీసెట్‌కు సంబంధించిన మొత్తం కసరత్తు పూర్తైంది. ఈ ఏడాది పరీక్షలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తన ప్రటకనలో పేర్కొంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) సీహెచ్‌ఎస్‌ఎల్ తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ నియామక నోటిఫికేషన్ కింద కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 3,954 ఖాళీల భర్తీ చేయనుంది. ఈ మేరకు షార్ట్‌లిస్ట్ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్-2024 అభ్యర్థుల తుది ఫలితాలను ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో టైర్-1 పరీక్షలు జులైలో నిర్వహించగా సెప్టెంబర్ 6న ఫలితాలు విడుదలయ్యాయి. ఇక టైర్- 2 పరీక్షలు నవంబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.