TS EAMCET: తెలంగాణలో రేపు, ఎల్లుండి జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తోన్న కారణంగా 14, 15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఓ ప్రకనట విడుదల చేసింది. వాయిదా పడ్డ పరీక్షల తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే 18,19,202 తేదీల్లో జరిగే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు తెలిపారు. ఆ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే యదాతథంగా నిర్వహించనున్నట్లు ఉన్న విద్యా మండలి ప్రకటించింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితును దృష్టిలో ఉంచుకొని సంబంధితి అధికారులతో సమీక్షించిన అనంతరం పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ లింబాద్రి ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు మొత్తం 2.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..