Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు

| Edited By: Subhash Goud

Jul 18, 2021 | 4:32 PM

Telangana: నిరుద్యోగులకు ఈ మధ్య కాలంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి..

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు
Telangana Dmho Hyderabad
Follow us on

Telangana: నిరుద్యోగులకు ఈ మధ్య కాలంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి(డీఎంహెచ్ఓ) కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 206 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నెల 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అంటే రేపే చివరి తేదీ అని. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎన్‌ఎం విభాగంలో 103 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో పాటు ఎంపీహెచ్‌డీబ్ల్యూ(ఎఫ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్, హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అయితే.. SC/ST/BC లకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

ఫార్మసిస్ట్: ఈ విభాగంలో 31 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసీలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఫార్మ్ డీ కోర్సు చేసిన వారు కూడా ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: ఈ విభాగంలో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసై DMLT/BSC(MLT) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలు నోటిఫికేషన్, అప్లికేషన్ http://dmhohyd.onlineportal.org.in/ లింకు ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

UGC New Regulations : అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.. నూతన నిబంధనలను జారీ చేసిన యూజీసీ