SSC Govt Jobs 2026: పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో 3003 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి 2026 సంవత్సరానికి గానూ ఫేజ్‌ 14 నోటిఫికేషన్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

SSC Govt Jobs 2026: పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో 3003 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం
SSC Selection Post Phase 14 Notification

Updated on: Apr 14, 2026 | 4:24 PM

వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి 2026 సంవత్సరానికి గానూ ఫేజ్‌ 14 నోటిఫికేషన్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3003 లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, లోయర్‌ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్‌, అకౌంటెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, స్టోర్‌ కీపర్‌, టెక్నీషియన్లు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, క్లర్క్‌ ఫార్మసిస్ట్‌, కోర్ట్‌ మాస్టర్‌ వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ XIV పోస్టుల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ XIV పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టులను అనుసరించి పదో తరగతి ఇంటర్మీడియట్, బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026వ తేదీ నాటికి పోస్టును బట్టి 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 4, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.1,50,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం

రాత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 60 నిమిషాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌ విభాగం నుంచి 25, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం నుంచి 25, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు చొప్పున కోత విధిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 13, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 4, 2026.
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: మే 5, 2026.
  • దరఖాస్తుల్లో తప్పుల సవరణ తేదీలు: మే 11 నుంచి మే 13, 2026వ తేదీ వరకు
  • రాత పరీక్ష తేదీ: జూన్‌ 2026లో నిర్వహించే అవకాశం

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ XIV పోస్టుల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us