SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

| Edited By: Subhash Goud

Jul 17, 2021 | 11:55 AM

SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి..

SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
SSC GD Constable Recruitment 2021
Follow us on

SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియమకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామకానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 17 నుంచి ప్రారంభం అయ్యే ఈ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 31 వరకు ఉంటుంది.

విద్యార్హత విషయానికొస్తే.. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించడానికి ఆగస్టు 31చివరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25,271 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం : జూలై 17, 2021
దరఖాస్తుల గడువు తేదీ: ఆగస్టు 31, 2021
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సిన చివరి తేదీ: సెప్టెంబర్‌ 2, 2021
ఆఫ్‌లైన్‌ చలాన్‌ చివరి తేదీ : సెప్టెంబర్‌ 4, 2021
చలాన్‌ ద్వారా ఫీజు చెల్లింపు (బ్యాంకు సమయాల్లో): సెప్టెంబర్‌ 7, 2021
కాగా, ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

TGWDEW Recruitment 2021: 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహితులు గుడ్ న్యూస్.. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TS POLYCET 2021: నేడు తెలంగాణ పాలీసెట్ ప్రవేశ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..