SSC CHSL 2020: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2020 పరీక్ష తేదీ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

|

May 24, 2022 | 8:29 AM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్‌ (SSC CHSL) 2020కు సంబంధించిన స్కిల్ టెస్ట్ పరీక్ష తేదీ విడుదలయ్యింది...

SSC CHSL 2020: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2020 పరీక్ష తేదీ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Ssc Chsl
Follow us on

SSC CHSL 2020 exam date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్‌ (SSC CHSL) 2020కు సంబంధించిన స్కిల్ టెస్ట్ పరీక్ష తేదీ విడుదలయ్యింది. జులై 1న స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు కమిషన్‌ తెల్పింది. హాజరు హాజరయ్యే అభ్యర్ధులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో వివరణాత్మక పరీక్ష షెడ్యూల్‌ను చెక్‌ చేసుకోవచ్చు. కాగా సీహెచ్‌ఎస్ఎల్‌ టైర్‌-2 (డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష ఈ ఏడాది జనవరి 9న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 45480 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీటికి సంబంధించిన ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. ఇక తదుపరి ఘట్టమైన స్కిల్‌ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. టైర్-I, టైర్-IIలలో కమిషన్ కట్-ఆఫ్ ప్రకారం.. మొత్తం 28,133 మంది అభ్యర్థులు DEST/టైపింగ్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్ష తేదీ కోవిడ్‌ 19 దృష్ట్యా తాత్కాలికంగా ప్రకటించామని, తేదీలో మార్పులు సంభవించే అవకాశం ఉందని, అభ్యర్ధులు క్రమం తప్పకుండా కమిషన్ వెబ్‌సైట్‌ని చెక్‌ చేయాలని ఈ సందర్భంగా సూచించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.