Coal India Jobs 2026: పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1055 మైనింగ్‌ సర్దార్‌, డిప్యూటీ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను..

Coal India Jobs 2026: పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం
South Eastern Coalfields Jobs

Updated on: Apr 09, 2026 | 4:50 PM

కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1055 మైనింగ్‌ సర్దార్‌, డిప్యూటీ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 15, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..

  • మైనింగ్‌ సర్దార్‌ గ్రేడ్‌-సి విభాగంలో పోస్టుల సంఖ్య: 577
  • డిప్యూటీ సర్వేయర్‌ గ్రేడ్‌-సి పోస్టుల సంఖ్య: 43
  • అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌) గ్రేడ్‌ సి పోస్టుల సంఖ్య: 435

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు లేదా మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మైనింగ్ సిర్దార్‌షిప్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ లేదా సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మే 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 చొప్పున ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఓలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.47,330 జీతంతోపాటు ఇతర అవలెన్సులు కూడా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో టెక్నికల్ నాలెడ్జ్ విభాగం నుంచి 80 ప్రశ్నలకు 80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు చొప్పున అడుగుతారు. నెగటివ్ మార్కింగ్‌ లేదు.

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us