SBI PO Mains Results: ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఫేజ్‌-3 పరీక్షలు ఎప్పటినుంచంటే

|

Jan 11, 2024 | 8:44 PM

ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి ఇటీవల మెయిన్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు గురువారం (జనవరి 11) విడుదలయ్యాయి. డిసెంబర్‌ 5, 16 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు ఫేజ్‌-3 పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలను..

SBI PO Mains Results: ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఫేజ్‌-3 పరీక్షలు ఎప్పటినుంచంటే
SBI PO Mains Results
Follow us on

ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి ఇటీవల మెయిన్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు గురువారం (జనవరి 11) విడుదలయ్యాయి. డిసెంబర్‌ 5, 16 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు ఫేజ్‌-3 పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలను ఈ కింది లింక్‌లో డైరెక్ట్‌గా చెక్‌ చేసుకోవచ్చు. ఫేజ్‌ 3 సైకోమెట్రిక్‌ పరీక్ష జనవరి 16 నుంచి జరుగుతుంది. గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఈ కింది పీడీఎఫ్‌లో తెలుసుకోవచ్చు.

ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.

జనవరి 17 నుంచి డీఈఈ సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌.. 25వ తేదీన సీట్ల కేటాయింపు

తెలంగాణ డీఈఈ సెట్‌ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ జనవరి 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ శ్రీనివాస చారి తెలిపారు. ఈ నెల 17వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన వివరించారు. జనవరి 25వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుంని పేర్కొన్నారు. కాగా తొలి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 1152 మంది సీట్లు పొందారు.

ఇవి కూడా చదవండి

నెట్‌, గేట్‌ అభ్యర్థులకునేరుగా పీహెచ్‌డీ సీట్లు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌-నెట్‌, గేట్‌, సీఈఈడీ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో అర్హత సాధించినవారికి పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే ‘ఆర్‌సెట్‌’ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రవేశాలు కల్పించనున్నారు. మిగతా సీట్లను ఉన్నత విద్యామండలి నిర్వహించే ఆర్‌సెట్‌ ద్వారా భర్తీచేస్తారు. కాగా ఆర్‌సెట్‌ను 200 మార్కులకు నిర్వహిస్తారు. రిసెర్చ్‌ మెథడాలజీకి 70 మార్కులు, సంబంధిత స్పెషలైజేషన్‌కు 70 మార్కులు, ఇంటర్వ్యూకు 60 మార్కులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యుఎస్‌ వారికి 45, ఇతరులకు 50 శాతం మార్కులను కనీస అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.