SBI Apprentice Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. SBIలో 6100 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు… చివరి తేదీ ఎప్పుడంటే..

|

Jul 06, 2021 | 11:10 AM

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

SBI Apprentice Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. SBIలో 6100 ఉద్యోగాలు... డిగ్రీ పాసైతే చాలు... చివరి తేదీ ఎప్పుడంటే..
Sbi
Follow us on

SBI Apprentice Recruitment 2021:

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు sbi.co.in వెబ్‏సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 31 నాటికి 20 -28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒక స్టేట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.  పూర్తి వివరాల కోసం https://www.sbi.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 125 ఖాళీలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 100 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (జూలై 6)నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 26 చివరితేదీ.

ఎంపిక ప్రక్రియ..
స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి.నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు తొలగిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఆగస్టు 2021లో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

Also Read: National Anthems: రికార్డు సాధించిన 17 ఏళ్ల కుర్రాడు.. 91 దేశాల జాతీయ గీతాల‌ను అలవోకగా ఆలపిస్తూ..

Audio Goes Viral: మండపేటలో ఫ్లెక్సీల వివాదం.. వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వార్నింగ్.. ఆడియో టేప్ కలకలం

Kangana Ranaut: మరోసారి సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. అమీర్ దంపతుల విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు..

Domestic Flights: కేంద్రం కీలక నిర్ణయం.. దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం పెంపు.. ఉత్తర్వులు జారీ..