SAI High Performance Analyst Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI).. దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ సెంటర్స్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రిసెర్చ్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన 138 హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో ఫిజియోథెరపిస్ట్ పోస్టులు 42, స్ట్రెంథ్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 42, ఫిజియాలజిస్ట్ పోస్టులు 13, సైకాలజిస్ట్ పోస్టులు 13, బయోమెకానిక్స్ పోస్టులు 13, న్యూట్రీషనిస్ట్ పోస్టులు 13, బయోకెమిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిజియోథెరపీ/స్పోర్ట్స్ అండః ఎక్సర్సైజ్ సైన్స్/స్పోర్ట్స్ సైన్స్/స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్/ఫిజికల్ ఎడ్యుకేషన్/మెడికల్/హ్యూమన్/స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ/లైఫ్ సైన్స్/బయోలాజికల్ సైన్సెస్/సైకాలజీ/బయోమెకానిక్స్/ డైటీషియన్/ఫుడ్ సైన్స్ అండః న్యూట్రిషన్/బయోకెమిస్ట్రీ/కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 5, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలేకుండానే.. అంటే అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,05,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.