భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఉత్తర రైల్వేలో 2022-23 సంవత్సరానికి సంబంధించి స్కౌట్స్, గైడ్స్ కోటాలో.. గ్రూప్ సి, డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎస్ అండ్ టీ విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హత కలిగినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు గ్రూప్ డి పోస్టులకైతే 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటే సరిపోతుంది. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.