RRB NTPC 2026 Exam Date: ఉత్కంఠకు తెర.. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు!

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష తేదీలను మాత్రం ఇంత వరకు ఆర్‌ఆర్‌బీ ప్రకటించలేదు. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల్లో సీబీటీ1 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఎప్పుడు ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..

RRB NTPC 2026 Exam Date: ఉత్కంఠకు తెర.. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు!
RRB NTPC 2026 Exam dates

Updated on: Feb 01, 2026 | 6:36 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష తేదీలను మాత్రం ఇంత వరకు ఆర్‌ఆర్‌బీ ప్రకటించలేదు. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల్లో సీబీటీ1 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్షలు ఏప్రిల్‌ నెల చివర్లో లేదా మే నెల ప్రారంభంలో ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచానా వేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి RRB త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనుంది.

ఈ పరీక్షల అనంతరం అండర్ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు మే నెలలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సీబీటీ 1 పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నిలకు 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. మొత్తం 3 విభాఆగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌, మ్యాథమెటిక్స్‌, రిజీనింగ్‌.. విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌.. రెండింటికి దాదాపు సిలబస్‌ ఒకేలా ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీఎస్‌టీ రీ-షెడ్యూల్‌ తేదీ విడుదల.. ఎప్పుడంటే?

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ కంప్యూటర్‌ బేస్డ్‌ స్కిల్‌ టెస్ట్‌ (CBTST) రి-షెడ్యూల్ తేదీని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షను ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్‌ 28న నిర్వహించిన పరీక్షకు హాజరై రీ-షెడ్యూల్‌ కోరుకున్న అభ్యర్థుల కోసం ఆర్‌ఆర్‌బీ తాజాగా నోటిసు విడుదల చేసింది. పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సిటీ ఇంటిమేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.