
హైదరాబాద్, డిసెంబర్ 25: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న సీబీటీ 1 పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) మారిన పరీక్షల తేదీలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు జరగాల్సిన ఆర్‌ఆర్‌బీ గ్రూడ్ డీ పరీక్షలు.. జనవరి 8, 9, ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.
గతంలో జారీ చేసిన పాత షెడ్యూల్ ప్రకారం.. జనవరి 2026 1 నుంచి 16 వరకు గ్రూప్ డీ పరీక్షలు జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జనవరి 8, 9, ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9, 10లో జరుగుతాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీని కూడా ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో తెలుసుకునే ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను పరీక్ష తేదీకి సరిగ్గా 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా పొందవచ్చు. అంటే జనవరి 8న పరీక్ష ఉన్నవారికి డిసెంబర్ 29 నాటికి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇక అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2024 సీబీటీ 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) విడుదల చేసింది. కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌లను కూడా ఆర్‌ఆర్‌బీ పొందుపరిచింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను రూ.50 చెల్లించి డిసెంబర్ 30 వరకు తెలువచ్చని బోర్డు ప్రకటించింది. సీబీటీ 2 పరీక్ష డిసెంబర్ 20న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 51,978 మంది అభ్యర్థులు సీబీటీ 2 పరీక్షకు ఎంపికయ్యారు. గత ఏడాది మొత్తం 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవగా ఇంటర్ అర్హతతో అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను ఈ భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ 2024 సీబీటీ 2 పరీక్షల కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.