RRB Railway Jobs 2026: రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతో భర్తీ చేసే..

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో.. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 15వ తేదీ నుంచి ఈ కింది ఆన్‌లైన్ లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వేలో అసిస్టెంట్ లోకోపైలట్ (ఏఎల్‌పీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) లేదా డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జూన్ 14, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, EBC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.250, ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరైతే రూ.400 తిరిగి అభ్యర్ధుల ఖాతాలో జమ చేస్తారు. ఎంపిక ప్రక్రియ మొత్తం 5 దశల్లో ఉంటుంది. సీబీటీ 1 పరీక్ష, సీబీటీ 2 పరీక్ష, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పే లెవల్ 2 కింద ప్రారంభ వేతనం నెలకు రూ.19,900తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 15, 2026.
- దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 14, 2026.
- ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూన్ 16, 2026.
- దరఖాస్తు సవరణ తేదీలు: జూన్ 17 నుంచి జూన్ 26వ తేదీ వరకు.
ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




