RITES Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Sep 08, 2022 | 6:20 AM

RITES Recruitment: రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(RITES) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ గురువాల్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు...

RITES Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Rites Jobs
Follow us on

RITES Recruitment: రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(RITES) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ గురువాల్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇందులో సీనియర్‌ కాంట్రాక్ట్‌ ఎక్స్‌పర్ట్‌, డ్రాయింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇంజినీర్‌, సెక్షన్‌ ఇంజినీర్‌, ప్లానింగ్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఇంజినీర్‌, సీఏడీ ఆపరేటర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* సివిల్‌, ఎలక్ట్రికల్‌, ల్యాబొరేటరీ, జనరల్‌ అండ్‌ ఓహెచ్‌ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకడూదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌, పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థుల నెలకు రూ. 15,400 నుంచి రూ. 22,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 14-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..