
హైదరాబాద్, సెప్టెంబర్ 18: పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ఏటా అందించే యూజీ స్కాలర్‌షిప్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 5,000 మంది విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఏదైనా స్ట్రీమ్‌లో రెగ్యులర్ ఫుల్‌టైమ్ డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.15 లక్షలకు మించకూడదు.
ఎంపికైన విద్యార్థులకు వారి డిగ్రీ చదువు కొనసాగించేందుకు మొత్తం రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఈ ఆర్థిక సాయంతో విద్యార్థులు తమ ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చులను కొంతవరకు భర్తీ చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులను వివిధ అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గతంలో సాధించిన అకడమిక్ ప్రతిభ, వ్యక్తిగత సమాచారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ అర్హతలు కలిగిన వారు రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్ 2026-27కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఉన్న విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఇంటర్‌లో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.