PM Modi: ప్రధాని మోదీతో మాట్లాడాలని ఉందా.. అయితే ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి.

|

Dec 19, 2022 | 9:10 PM

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారి కోసం రిజిస్ట్రేషన్‌ ప్రకియ జరుగుతోంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌..

PM Modi: ప్రధాని మోదీతో మాట్లాడాలని ఉందా.. అయితే ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి.
Pariksha Pe Charcha 2023
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారి కోసం రిజిస్ట్రేషన్‌ ప్రకియ జరుగుతోంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి ట్వీట్ చేస్తూ.. ‘ఎగ్జామ్‌ వారియర్స్‌ సిద్ధంగా ఉండండి. పరీక్ష పే చర్చతో మన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ జీ మళ్లీ వస్తున్నారు. పరీక్షలు, జీవితానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవటానికి పరిష్కారాలను తెలుసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజే http://innovateindia.mygov.in/ppc-2023/లో రిజిస్ట్రేషన్‌ చేసుకోండి’ అని రాసుకొచ్చారు.

పరీక్షా పే చర్చలో పాల్గొనాలనుకునే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను డిసెంబర్ 30 వరకు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ mygov.in ద్వారా డిసెంబర్ 30, 2022 నాటికి పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా innovateindia.mygov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌ పేజీలో ‘PPC 2022’ కోసం లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘పార్టిసిపేట్ నౌ’పై క్లిక్ చేసి.. విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల లాగిన్‌లో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి చివరిగా పీడీఎఫ్‌ను సేవ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే పరీక్షా పే చర్చా కార్యక్రామాన్ని నరేంద్రమోదీ తొలిసారి 2018లో ప్రారభించారు. అంనతరం ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ ఏడాది నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా విజేతలకు సర్టిఫికేట్లతో పాటు పరీక్షా కిట్‌లు కూడా అందించనుండడం విశేషం.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..