PDIL Recruitment: ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Aug 02, 2022 | 6:25 PM

PDIL Recruitment: ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు...

PDIL Recruitment: ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Follow us on

PDIL Recruitment: ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డిప్లొమా ఇంజనీర్ (25), డిగ్రీ ఇంజనీర్ (107) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* డిప్లొమా ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో డిప్లొమా/ బీఎస్‌సీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. డిగ్రీ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్‌/బీఈ లేదా ఎమ్‌ఎస్‌సీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 32 నుంచి 43 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట పని అనుభవం, అకడమిక్‌ అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

* జనరల్ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ. 400 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 28-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* డిప్లొమా ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 23,940 నుంచి రూ. 31,770 వరకు చెల్లిస్తారు. డిగ్రీ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 38,250 నుంచి రూ. 53,730 వరకు చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..