కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. అంతకుముందు ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభించని సంస్థలు సైతం కరోనా తర్వాత ఇంట్లో నుంచే పని చేసే వెసులుబాటును కల్పించాయి. కేవలం ఐటీ సంబంధిత ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశాయి.
దీంతో నాన్ ఐటీ ఉద్యోగులు కూడా ఇంట్లో ఉండే పని చేస్తున్నారు. ఇక కరోనా పుణ్యమాని ఇంట్లో నుంచి పనిచేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆధారిత ఉద్యోగాలకు సైతం డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆన్‌లైన్‌లోనూ సొంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏ సంస్థలో పనిచేయకుండానే సొంతంగా ఆన్‌లైన్‌లో సంపాదన ఆర్జించవచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో సంపాదన ఆర్జించే కొన్ని మార్గాలపై ఓ లుక్కేయండి..
* కరోనా తర్వాత ఆన్‌లైన్‌లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఆన్‌లైన్‌లో కోచింగ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇచ్చే సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి వాటిలో ట్యూటర్‌గా చేరి డబ్బులు ఆర్జించవచ్చు. మీ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్‌కు అనుగుణంగా వేతనం చెల్లిస్తారు. లింక్డ్‌ఇన్ వంటి జాబ్ పోర్టల్స్‌లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల కాల్స్ పొందొచ్చు.
* ప్రస్తుతం కంటెంట్ రైటర్స్‌కి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కాంట్రాక్ట్ విధానంలో కంటెంట్ రైటర్స్ తీసుకుంటున్న సంస్థలు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా కంటెంట్ రైటర్స్‌ను హైర్ చేసుకుంటున్నాయి. అన్ని రకాల భాషల్లో కంటెంట్ రైటర్లకు డిమాండ్ పెరుగుతోంది. మీకు ఒకవేళ రైటింగ్‌లో మంచి ప్రావీణ్యం ఉంటే సింపుల్‌గా ఆన్‌లైన్‌లో పని చేసుకోవచ్చు. జాబ్ పోర్టల్స్‌లో కంటెంట్ రైటర్‌గా రిజిస్టర్ చేసుకుంటే రిక్రూటర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి.
* ఇక ఈ కామర్స్‌కు డిమాండ్ పెరిగిన తర్వాత ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాపారులను భాగస్వామ్యం చేస్తూ ఈ కామర్స్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో ఇంట్లో తయారు చేసే వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పోర్టల్స్‌లో వస్తువులను విక్రయించుకోవచ్చు.
* కంటెంట్‌కు డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ట్రాన్స్‌లేటర్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇతర భాషల నుంచి నచ్చిన భాషలోకి అనువాదం చేసే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇలాంటి వారికి డిమాండ్ పెరుగుతోంది. సినిమాల్లో సబ్‌సైటిల్స్ మొదలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ వరకు ఇలా ట్రాన్స్‌లేటర్స్‌ను నియమించుకుంటున్నారు. జాబ్ పోర్టల్స్‌లో ట్రాన్స్‌లేటర్స్ పేరుతో ఉద్యోగాలను సెర్చ్ చేయడం ద్వారా ఇలాంటి పార్ట్ టైమ్ ఉద్యోగాలను పొందొచ్చు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..