ONGC Recruitment 2022: పదో తరగతి అర్హతతో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ కొలువులు.. అకడమిక్‌ మెరిట్ ఆధారంగా ఎంపిక..

మహారాష్ట్రలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 64 డిప్లొమా/ట్రేడ్/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

ONGC Recruitment 2022: పదో తరగతి అర్హతతో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ కొలువులు.. అకడమిక్‌ మెరిట్ ఆధారంగా ఎంపిక..
ONGC Maharashtra Recruitment 2022

Updated on: Nov 23, 2022 | 4:03 PM

మహారాష్ట్రలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 64 డిప్లొమా/ట్రేడ్/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతితోపాటు సెక్రటేరియల్‌ ప్రాక్టిస్‌/స్టెనోగ్రఫీ/ఎలక్ట్రీషియన్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్/వెల్డర్/ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌/ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితర ట్రేడులో ఐటీఐ, బీఏ, బీబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్‌ 5, 2022వ తేదీనాటికి తప్పనిసరిగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే డిసెంబర్‌ 5, 1994 నుంచి డిసెంబర్‌ 5, 2004 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 5, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.7,700ల నుంచి రూ.9,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సెక్రటేరియల్ అసిస్టెంట్ ఖాళీలు: 5
  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ ఖాళీలు: 5
  • ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 9
  • ఫిట్టర్ ఖాళీలు: 7
  • మెషినిస్ట్ ఖాళీలు:3
  • ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలు: 14
  • అకౌంటెంట్ ఖాళీలు: 7
  • వెల్డర్ ఖాళీలు: 3
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఖాళీలు:3
  • లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) ఖాళీలు: 2
  • రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ఖాళీలు: 2
  • వైర్‌మ్యాన్ ఖాళీలు: 2
  • ప్లంబర్ ఖాళీలు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us