NTR Trust Gest 2023 Scholarship: పదో తరగతి బాలికలకు గుడ్‌న్యూస్‌! ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ 2023 స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బాలికా విద్యా స్కాలర్‌షిప్‌ పరీక్ష (జీఈఎస్‌టీ) -2023కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన విద్యార్ధినులకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి..

NTR Trust Gest 2023 Scholarship: పదో తరగతి బాలికలకు గుడ్‌న్యూస్‌! ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ 2023 స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం..
NTR Trust Gest 2023 Scholarship

Updated on: Nov 24, 2022 | 4:15 PM

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బాలికా విద్యా స్కాలర్‌షిప్‌ పరీక్ష (జీఈఎస్‌టీ) -2023కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన విద్యార్ధినులకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి న‌వంబ‌రు 23న‌ ప్రకటన విడుదల చేశారు. క్లాట్‌, ఐపీఎం, జేఈఈ-మెయిన్‌, నీట్‌, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్ధినులకు ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 2022-23 విద్యాసంవత్సరానికి పదోతరగతి చదివే బాలికలు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ లో నవంబర్‌ 30, 2022వ తేదీలోపు అన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాల నివృతి కోసం 7660002627/28 నంబర్‌లను సంప్రదించవచ్చు.

స్కాలర్‌షిప్‌ వివరాలు..

జీఈఎస్‌టీ -2023 పరీక్ష డిసెంబర్‌ 4వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5,000లు చొప్పున, ఆ తర్వాత 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్‌ రెండేళ్లు పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం అందుతుంది.

రాత పరీక్ష విధానం..

మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులకుగానూ.. 2 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us