NTPC Assistant Officer( safety) Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).. ఒప్పంద ప్రాతిపదికన 20 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల (Assistant Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/ఎంటెక్/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.1,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.