NTA SWAYAM July 2021: స్వయం జూలై 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. 300 ఆన్‌లైన్‌ కోర్సుల్లో..

|

Feb 11, 2022 | 4:52 PM

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్వయం జూలై (SWAYAM July) 2021అడ్మిట్ కార్డులను విడుదల చేసింది...

NTA SWAYAM July 2021: స్వయం జూలై 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. 300 ఆన్‌లైన్‌ కోర్సుల్లో..
Swayam July
Follow us on

SWAYAM July Admit Card 2021 Released: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్వయం జూలై (SWAYAM July) 2021అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌swayam.nta.ac.inలో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్ష ఫిబ్రవరి 21, 22 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్ష 180 నిమిషాల పాటు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 300 స్వయం ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షలను నాలుగు షిఫ్టులుగా విభజించి నిర్వహించనున్నారు.

స్వయం జూలై 2021అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా ఎన్టీఏ అధికారిక సైట్‌swayam.nta.ac.inలోకి లాగిన్‌ అవ్వాలి.
  • హోమ్ పేజీలో కనిపించే స్వయం జూలై అడ్మిట్ కార్డ్ 2021 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
  • మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ తీసుకోవాలి.

ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ swayam.nta.ac.inను సందర్శించండి.

Also Read:

IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..