Teaching Jobs: తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Dec 20, 2022 | 6:41 PM

తెలంగాణ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజామాబాద్‌లోని ఈ యూనివర్సిటీలో టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సారంగాపూర్ క్యాంపస్), పీజీ కాలేజ్(భిక్‌నూర్‌)లో లెక్చరర్‌..

Teaching Jobs: తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Telangana University Jobs
Follow us on

తెలంగాణ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజామాబాద్‌లోని ఈ యూనివర్సిటీలో టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సారంగాపూర్ క్యాంపస్), పీజీ కాలేజ్(భిక్‌నూర్‌)లో లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పార్ట్ టైమ్‌ విధానంలో ఈ ఖాళీలను తీసుకోనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పార్ట్ టైం లెక్చరర్(ఎంఈడీ) (04), పార్ట్ టైం లెక్చరర్(ఎంఎస్సీ జువాలజీ) (03) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు యూజీసీ- నెట్‌/ సెట్‌/ స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్‌పై తప్పనిసరిగా పట్టుండాలి.

* అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను సంబంధిత కాలేజీకి ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, అకడమిక్ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 27-12-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..