NIPER JEE 2022 నోటిఫికేషన్‌ విడుదల! పరీక్ష ఎప్పుడంటే..

|

Apr 05, 2022 | 7:20 AM

నైపర్‌ 2022-23 విద్యాసంవత్సరానికి గాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (NIPER JEE 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది..

NIPER JEE 2022 నోటిఫికేషన్‌ విడుదల! పరీక్ష ఎప్పుడంటే..
Niper Jee 2022
Follow us on

NIPER JEE-2022 exam date: నైపర్‌ 2022-23 విద్యాసంవత్సరానికి గాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (NIPER JEE 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫార్మసీలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది నైపర్‌ జేఈఈ పరీక్షను నైపర్‌ హైదరాబాద్‌ (NIPER Hyderabad) నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఇతర పూర్తి వివరాలు మీకోసం..

వివరాలు:

పరీక్ష: నైపర్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ-2022)

కోర్సుల వివరాలు: ఎంఫార్మసీ, ఎంఎస్‌ (ఫార్మా), ఎంటెక్‌ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్‌డీ

విభాగాలు: బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ త‌దిత‌రాలు

నైపర్‌ క్యాంపస్‌లు: అహ్మదాబాద్‌, గువహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్‌

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జీప్యాట్/ గేట్‌/ నెట్‌ జాతీయ పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక‌ విధానం: కంప్యూటర్‌ ఆధారిత ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రకియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: మే 3, 2022.

ప్రవేశ పరీక్ష తేది: జూన్‌ 12, 2022

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

Telangana: 150 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం! పెనుగండంలో తెలుగు భాష..