తెలంగాణ రాష్ట్రంలోనున్న సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్.. 31 అసిస్టెంట్ ప్రొఫెసర్, రిహాబిలిటేషన్ థెరఫిస్ట్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎంబీబీఎస్/బ్యాచిలర్స్ డిగ్రీ/బీకామ్/బీఈడీ/బీఆర్‌ఎస్/ఎండీ/ఎంఈడీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఎంఫిల్/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 7, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్ధులు నెలకు రూ.22,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
The Director,
NIEPID,
Manovikas nagar,
Secunderabad-500009.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.